Back
Home » సంబంధాలు
మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఏవిధంగా కనుగొనవచ్చు ?
Oneindia | 29th Oct, 2019 03:29 PM
 • 1) శ్రద్ధ వహించండి :

  వారి ప్రవర్తనపై లోతైన శ్రద్ధ వహించండి. వారి రెగ్యులర్ లేదా సాధారణ మార్పులలో తేడాలున్నాయా? లేక వారి విషయాల పట్ల అనుమానాస్పద వైఖరి ఏదైనా ఉందా? వారు తమ రెగ్యులర్ సమయం కన్నా ఆలస్యంగా వస్తున్నారా? లేదా వారు మీపట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారా? వారు మిమ్మల్ని విస్మరిస్తున్నారా? లేక వారు వేరొకరిలా కనపడుతున్నారా? వారు ఎక్కువ సమయం "కొత్త స్నేహితుని" తో గడుపుతూ ఉన్నారా? ఎక్కువసమయం ఫోన్లో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారా? అందరితో మామూలుగా ఉండి, మీతో మాత్రం విసుగు చెందిన అనుభూతికి లోనవుతున్నారా ? లోతుగా ఆలోచన చేయడానికి ముందుగా ఇటువంటి ప్రశ్నలను మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి.


  మీ మనస్సును ఇతర సానుకూల అవకాశాలకు కూడా తలుపులు తెరిచి ఉంచండి. వారికి పని చాలా ఎక్కువగా కూడా ఉండవచ్చు, లేదా వారు మీకు చెప్పలేని ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండవచ్చు, అదే క్రమంలో భాగంగా మిమ్మల్ని ఆ సమస్యలో భాగస్వామ్యం చేయడం వాళ్లకు ఇష్టం లేకుండా కూడా ఉండొచ్చు. వారి మనస్సులో కూడా వేలాది విషయాలు ఉండవచ్చు. పైన పేర్కొన్న ప్రశ్నలలో ఏవైనా నిజమని మీరు కనుగొంటే., అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.


 • 2) సెల్ ఫోన్ చెక్ చేస్తున్నారా :

  మీ భాగస్వామి ఫోన్ను తనిఖీ చేయడం సాంకేతికత అంశాల పరంగా చాలా సులభమైన విషయం. మీరు ఎప్పుడైనా వారి మొత్తం ఫోన్ కార్యాచరణను తనిఖీ చేయవచ్చు. వారు ఎవరికి టెక్స్టింగ్ చేస్తున్నారు. ఆ టెక్స్ట్స్ సారాంశం ఏమిటి? టెక్స్ట్స్ మరియు కాల్స్ సమయం. మొత్తం కాల్ లాగ్ వివరాలు మొదలైనవి అనేకం మీరు తెలుసుకునే సౌలభ్యం ఉంది. కొంత సాంకేతికపరమైన తెలివి ఉంటే చాలు. మీరు వారి సెల్ ఫోన్లను ట్రాక్ చేయడం ద్వారా వారి లొకేషన్ కూడా ట్రాక్ చేయవచ్చు.

  ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే వారి ఫోన్ను ఎలా తనిఖీ చేయాలి? మీరు వారి ఫోన్ నంబర్ నుండి, వారి పేరు ద్వారా వాటిని ట్రాక్ చేయవచ్చు. అనేక సెల్ ఫోన్లలో లుక్అప్ అనువర్తనాలు మరియు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అవి కొంతమేర మీకు సహాయాన్ని అందివ్వగలవు. కానీ, వ్యక్తిగత స్వేచ్చకు భంగం వాటిల్లిందని, లేదా తనను అకారణంగా అనుమానిస్తున్నారని మీ భాగస్వామి భావించిన ఎడల వారు కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. కావున, మీరు వారి మనసులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించవలసి ఉంటుందని మరువకండి..


 • 3) వారు మిమ్మల్ని విశ్వసిస్తున్నారా?

  సాధారణంగా, ప్రజలు వేరొకరికోసం మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు, వారు మిమ్మల్ని విశ్వసించడం పూర్తిగా మానేస్తారు. వారు మిమ్మల్ని దగ్గరగా ఉండటానికి కూడా అనుమతించరు. వారు మిమ్మల్ని తమ ఫోన్ లేదా కంప్యూటర్ తాకడానికి సైతం అనుమతించరు. వారు మీ నుండి తమను తాము దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. వారు మీతో బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. అంతేకాకుండా, మిమ్మల్ని అభినందించడం మానేస్తారు ఎందుకంటే వారు మిమ్మల్ని, మీరు చేసే పనులను గమనించరు కాబట్టి. వారు మీరు ఉపయోగించే వస్తువులను వినియోగించడానికి కూడా అయిష్టత కనపరుస్తారు. వారు మీ నుండి, మీ కుటుంబం, మీ స్నేహితులను కూడా వేరుచేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరియు కొంతకాలం వారు మీ పరస్పర స్నేహితులతో కూడా కలవడానికి సుముఖంగా ఉండరు.


 • 4) ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారా?

  మానవ మనస్తత్వశాస్త్రం ప్రకారం, వారు కొన్ని విషయాలను వారికి మాత్రమే అనుగుణంగా, మీకు వ్యతిరేకంగా రూపొందించడానికి ప్రయత్నిస్తారు. ప్రవర్తనలో ఒక రకమైన మార్పు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కఠినంగా వ్యవహరించడం, లేదా అనుమానాస్పద వైఖరిని ప్రదర్శించడంఉంటుంది. అతను/ఆమె ఎటువంటి కారణం లేకుండా, మీకు పువ్వులు తెచ్చి, మీకు విందును ఇవ్వజూస్తుంటే, వారి ప్రవర్తన ఎందుకు మారుతుందో వారిని అడగవలసిన సమయం వచ్చిందనే అర్ధం.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
ఈరోజుల్లో అనేకమందిలో మోసానికి గురవుతున్నామనే భయం కనపడడం వాస్తవమే. కానీ ప్రతి ఒక్కరూ మోసం చేయరు అనేది కూడా ఒక తిరుగులేని వాస్తవం. ఒక్కోసారి మనిషి, సగం భయంతో మోసపోవడం జరుగుతుంటుంది., క్రమంగా మళ్ళీ ఆ వ్యక్తిని నమ్మడం కష్టంగా ఉంటుంది. మీరు నిజం అని అపోహపడ్డ విషయాలు అబద్దం అయిఉండవచ్చు కూడా. కానీ, మీ మనసులో మాత్రం అవతలి వ్యక్తి పట్ల అభద్రతాభావన పూర్తిస్థాయిలో నిండిపోయి ఉంటుంది. కావున, ఆ సమస్యపై దృష్టి సారించడం ద్వారా, అపోహలు తొలగి వాస్తవాన్ని చూడగలుగుతారు. మీ హృదయాన్ని మళ్లీ మళ్ళీ విచ్ఛిన్నం చేయడం కంటే ఈ పద్దతి అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది.

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీరు భావించినా కూడా, మీరు దానిని విస్మరించవచ్చు. కాని ఆ భావన ఎప్పటికీ పోదు. అతను / ఆమె మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అన్న ఆలోచన మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. కావున, అటువంటి సంకేతాలను విస్మరించకుండా ఆ అనుమానాలను నివృత్తి చేసుకునేలా పరిష్కార మార్గాలు ఆలోచించడం మంచిది. ఒక్కోసారి మీ అనుమానాలు అబద్దాలుగా కూడా మిగిలిపోవచ్చు. అప్పుడు వారిపట్ల అలా ఆలోచన చేసినందుకు బాధపడే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ భాగస్వామి గురించి తెలుసుకోవడం అంత కష్టమైన అంశమేమీ కాదు.

మీకు సోషల్ మీడియా ఉంది, ఇది వ్యక్తులపై కొంత అవగాహన కలిగి ఉండడానికి సూచించదగిన ఉత్తమమైన ప్రదేశం. బహుశా మీరు మతిస్థిమితం కోల్పోయి అలా ఆలోచిస్తున్నారేమోనని మనసులో గుర్తుంచుకోండి. మీకు కొంత రుజువు వచ్చేవరకు బాధపడవలసిన అవసరం లేదు.

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి సూచించదగిన కొన్ని మార్గాలను ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి.