Back
Home » సంబంధాలు
మీ మాజీ ప్రియుడి గురించి కలలు ఎందుకు వస్తాయో తెలుసా..
Oneindia | 2nd Nov, 2019 01:43 PM
 • గతంలో విషయాలు..

  గతంలో జరిగిన విషయాలు ప్రస్తుతం నిజం కావు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మిమ్మల్ని అంత సులభంగా విడిచిపెట్టవు. చాలా రోజులు, నెలలు, కొందరికి సంవత్సరాల తరబడి వెంటాడుతూనే ఉంటాయి. ఇవి మీ కొత్త రిలేషన్ షిప్ లపై కొంత ప్రభావం చూపుతాయి. అంతేకాదు మీరు ప్రస్తుత ఉన్న రిలేషన్ షిప్ ను కూడా విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంది. ఇది మీ విధేయతతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది మీ మనసుకు సంబంధించిన విషయం కాబట్టి చేతన వల్ల లేదా అచేతన వల్లనో ప్రతి ఒక్క కల వెనుక ఒక రహస్య అర్థం ఉంటుందని, వాటి వల్ల కోరికను తీర్చుకోవాలి అనే ఒక అర్థం కూడా వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.


 • ఇంకా ప్రేమించే అవసరం లేదు..

  మీరు మీ మాజీ ప్రేమికుడిని ఇంకా ప్రేమించడం లేదు. కానీ మీ మాజీ ప్రియుడిని కలలో చూడటం అంటే మీరు అతన్ని ఇంకా ప్రేమిస్తున్నారని అర్థం కాదు. అలాంటి కలలో ఎలాంటి అర్థమూ లేదు. మనం కలల గురించి మాట్లాడుకుంటే అవి ఎప్పుడైనా సాధారణంగా అందరికీ వచ్చేవే. వీటి వెనుక సాహిత్య వివరణలు, సంకేతాత్మకమైన అర్థాలు ఎన్నో ఉంటాయి. మీరు మీ మాజీ ప్రియుడి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మీకు వారి గురించి కలలు వస్తాయి. అయితే మీరు దేని గురించి కల గంటున్నారో, అందులో ఏదో వెలితి ఉందని, అది నెరవేరడానికి మీరు ఆశపడుతున్నారని ఇది సూచిస్తుంది.


 • కోలుకోలేని లోతైన గాయం..

  మీ ప్రియుడు మిమ్మల్ని తీవ్రంగా బాధించాడని, మీరు ఇంకా అతను చేసిన లోతైన గాయం నుండి కోలుకోలేక పోయిన సందర్భాల్లో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ఆ క్షణంలో మీరు గతంలో కలిసి ఉన్న సందర్భంలో ఎలా ఉండే వారు లేదా ఏమి చేసే వారు అనే విభిన్న విషయాలకు సంబంధించి పదే పదే కలలో ఊహించుకుని బాధపడతారు. ఈ నేపథ్యంలోనే రిలేషన్ షిప్ అన్నాక కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంబంధాన్ని కోల్పోతుంటారు అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇది కూడా జరిగిందని మీరు భావించాలి. నెరవేరని అవసరాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాబట్టి కోలుకోవడానికి కొంత సమయం ఎక్కువగానే తీసుకుంటుంది.


 • మధుర క్షణాలు..

  మీ మాజీ ప్రియుడి గురించి ఆలోచించి అవనసరంగా టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇద్దరూ గతంలో కలిసి ఉన్న సందర్భంలో గడిపిన మధుర క్షణాల కారణాల వల్ల కూడా మీ ప్రియుడిని మీరు కలలో చూస్తారు. శృంగారపరంగా బాగా ఉత్సాహంగా ఉన్న మీ భాగస్వామి మీతో సంతోషంగా గడిపినట్లు లేదా మిమ్మల్ని ఎంతగానో సంరక్షించినట్లు ఇలా ఎన్నెన్నో కలలు కూడా వస్తూ ఉండొచ్చు. మీరు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అవి మీకు దక్కనప్పుడు ఇలాంటి కలలు వచ్చే అవకాశముందని మానసిక నిపుణులు స్పష్టం చేశారు.


 • పరిష్కారం కాని సమస్యలా..

  మీ మనసులో మీరు మీ మాజీ ప్రియుడి గురించి మెమోరీస్ ను ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇలాంటివి పరిష్కారం లేని సమస్యలుగా మిగిలిపోయే అవకాశం ఉందని కూడా మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మీరు మీ ప్రస్తుత ప్రియుడిని కూడా కోల్పోతారు.


 • భయంకరమైన కలలు..

  మీ మాజీ ప్రియుడితో గతంలో రిలేషన్ షిప్ బాగోలేకపోయినా లేదా అత్యంత బాధాకరంగా గనుక మీ జీవితం అప్పుడు గడిచి ఉంటే, అలాంటి సమయంలో కూడా మీరు మీ మాజీ ప్రియుడిపై ప్రతికూలంగా ఆలోచించే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రస్తుత ప్రియుడితో లేదా భాగస్వామిపై కూడా చూపే అవకాశం ఉంది. ఈ కలల వల్ల మీరు అసంబద్ధంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమయాల్లోనే భయపెట్టే కలలు కూడా వస్తూ ఉంటాయి. అవి పీడకలలుగా మారి మిమ్మల్ని తీవ్ర భయభ్రాంతులకు కూడా గురి చేసే అవకాశం ఉన్నందున మీరు మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
మీరు మీ జీవితంలోని మంచి సమయాన్ని ఒక వ్యక్తితో గడిపినప్పుడు, అతని గురించి మాత్రమే ఆలోచించడం సాధారణ ధోరణి. ప్రస్తుతం ఆ వ్యక్తి మీతో ఉండకపోవచ్చు. కానీ అతని జ్ఞాపకాలు మనస్సులో మెదలుతూ ఉంటాయి. మన మెదడులోని ఒక భాగం మంచి మరియు చెడు యొక్క అన్ని జ్ఞాపకాలను ఉంచుతుంది. ఇప్పుడు మీరు మీ భాగస్వామిని పూర్తిగా మరచిపోయారని ఆ సంబంధం నుండి కోలుకున్నారని మీరు భావిస్తున్నారు.

కానీ అకస్మాత్తుగా ఒక రాత్రి మీరు వాటిని మీ కలలో చూస్తారు. చాలా మంది అమ్మాయిలకు వారి ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్స్ కంటే వారి మాజీ భాగస్వామిని ఎక్కువగా కలలు కంటున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఎందుకు అలా అనిపిస్తుంది. మీ మాజీ ప్రియుడిని కలలో చూడటానికి కారణాలు ఏమిటో తెలుసుకోండి. దీని గురించి మానసిక వైద్యులు ఏమంటున్నారో తెలుసుకోండి.