Back
Home » సంబంధాలు
ట్రెండింగ్! తల్లి పెళ్లి కోసం తపన పడుతున్న కూతురు గురించి మీకు తెలుసా..
Oneindia | 4th Nov, 2019 01:15 PM
 • తల్లి కోసం తపన..

  తమ మత ఆచారాలు, సంప్రదాయాలు ప్రకారం ప్రతి ఒక్క మహిళ కేవలం ఒకరితోనే జీవితాంతం జీవించాలి అనుకుంటారు. కొందరు మాత్రం విడాకులు తీసుకుని మధ్యలోనే విడిపోతుంటారు. ఇంకొందరేమో ఒంటరిగా జీవిస్తుంటారు. ఇంకొందరు వితంతువులుగా మారి సమాజంలో చిన్నచూపుకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో తాను కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే తన తల్లి ఒంటరిగా మారుతుందని భావించిన లా కాలేజీ విద్యార్థిని ఆస్తా శర్మ తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది.


 • షరతులివే..

  తన తల్లికి అందమైన వరుడు కావాలని తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతకుముందే 'టిండర్' అనే డేటింగ్ యాప్ లో తన తల్లి కోసం మంచి వరుడిని వెతికింది. తన తల్లి కోసం 50 ఏళ్ల అందమైన వరుడు కావాలని, మందు, పొగ తాగడం, ప్యూర్ వెజిటేరియన్ అయ్యి ఉండాలి. అంతేకాదు జీవితంలో బాగా సెటిల్ అయి ఉండాలి. ఇలా తన తల్లికి కాబోయే వరుడి గురించి ఏయే లక్షణాలు కావాలో ట్విట్టర్లో రాసుకొచ్చింది.


 • నెటిజన్లు ఫిదా..

  Images curtosy

  ఆస్తా శర్మ ట్వీట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె ట్వీట్ కు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నువ్వు గొప్ప కూతురువి.. మీ తల్లీ కూతుళ్లు మంచి స్నేహితుల్లా' ఉన్నారు. తల్లి గురించి ఆస్తా శర్మ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ అని రీ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొందరు తమకు తెలిసిన వారి వివరాలు బ్యాచ్ లర్స్, విడాకుల తీసుకున్న పేర్లు, తమ కుటుంబ సభ్యుల వివరాల రూపంలోనూ కామెంట్స్ విభాగంలో వివరిస్తున్నారు. తన తల్లికి మంచి వరుడు దొరుకుతాడో లేదో చూడాలి మరి.


 • ప్రతి ఒక్కరికీ తోడు అవసరం..

  జీవితం అన్నాక ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో లేదా ఏదైనా సందర్భంలో తోడు అవసరం అవుతుంది. దానికి వయసుతో సంబంధం లేదు. అందులోనూ ఒంటరి మహిళలు ఈ సమాజంలో చిన్నచూపుకు గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో లా కాలేజీ స్టూడెంట్ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమే.


 • గతంలో ఫేస్ బుక్ లోనూ..

  ఇంతకుముందు కూడా ఓ కుమారుడు తన తల్లికి రెండో వివాహం జరిపించాడు. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోని కేరళ జిల్లా కొల్లాం జిల్లాలోనే. ఇంజనీర్ అయిన గోకుల్ శ్రీధర్ తన తల్లికి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుతూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
అమ్మ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే అమ్మకు భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది గనుక. అంతేకాదు త్యాగానికి మారు పేరు అమ్మ. కన్న బిడ్డల కోసం ఎంతటి కష్టాన్ని అయినా సరే చిన్న చిరునవ్వుతోనే భరించే గొప్ప మహిళ. పంటి బిగువన పురుటి నొప్పులను భరించి పునర్జన్మను సాధిస్తుంది.

తను ఎంత కష్టపడినా పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అనుకునే అమ్మకు ఓ కూతురు ఇటీవల సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టింది. అదేంటంటే తన తల్లికి మళ్లీ పెళ్లి చేయడానికి సిద్ధమైంది. తన తల్లికి ఎలాంటి వరుడు కావాలో కూడా షరతులను సైతం పోస్ట్ చేసింది ముంబైకి చెందిన ఆస్తా శర్మ. ఈ ట్వీట్ కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ తల్లికి ఎలాంటి భర్త కావాలో, ఏమేమీ లక్షణాలు ఉండాలి అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.