ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకరిని ప్రేమించడం లేదా ప్రేమించబడటం అనేది చాలా అద్భుతమైన అనుభూతి. ఎవరైనా మిమ్మల్ని కలుసుకోవడం ప్రారంభించినప్పుడు, మీరు వారితో మీ భవిష్యత్తు గురించి చాలా మాట్లాడుకుంటూ నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇలాంటివి మీ బంధాన్ని బాగా బలపరుస్తాయి. కానీ ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో పదే పదే సమస్యలు చెప్పుకోవడం ప్రారంభించడం.. వారి నుండి ఏదో ఆశించడం చేస్తే, వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
అలాగే మీరు సినిమాలను ఫాలో అయితే కూడా కష్టమే. ఎందుకంటే సినిమాలో ప్రేమలు ప్లాన్ ప్రకారం నాటకీయంగా సాగుతాయి. అలాంటి ప్రేమలు చాలా వరకు వాస్తవాం కాదు. అందుకే మీరు రిలేషన్ షిప్ లో లేదా ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్లడం వంటివి చేస్తుంటే మీరు కచ్చితంగా నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల మీ ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో చీలికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే మీరు ప్రేమలో ఉన్నసమయంలో కచ్చితంగా ఆశించడకూడని విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.