Back
Home » సంబంధాలు
రీబౌండ్ రిలేషన్ షిప్ లో ప్రేమ ఉండదా? కేవలం శారీరక సంబంధమే ఉంటుందా?
Oneindia | 16th May, 2020 01:06 PM
 • రీబౌండ్ రిలేషన్ అంటే?

  ఎవరితో అయిన విడిపోయి బాధపడేవారికి, దాని నుండి సులభంగా బయటపడేందుకు రీబౌండ్ రిలేషన్ షిప్ ఒక మంచి మార్గంగా పరిగణించబడుతుంది. ఈ నొప్పిని వీలైనంత త్వరగా మరచిపోవడానికి ఎవరైనా త్వరగా మరొకరితో సంబంధం కలిగి ఉంటారు. వారు దీనిని నిజమైన ప్రేమగా పరిగణించే అవకాశం కూడా ఉంది. అయితే వారు రీబౌండ్ రిలేషన్ షిప్ లో ఉన్నారా లేదా అని చెప్పేందుకు మరి కొన్ని కారణాలను ఇప్పుడు చూద్దాం.


 • సయోధ్య సంబంధం..

  సయోధ్య అంటే ప్రేమ వైఫల్యం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించడం కానీ చాలా మంది పురుషులకు ఈ విషయం తెలియదు. అయితే మీ ప్రేమకు సంబంధించిన కొత్త జీవితంలో ఎల్లప్పుడూ రొమాన్స్ అంటే మాత్రం మీకు మళ్లీ విసుగు పుడుతుంది.


 • ఒంటరిగా జీవించలేక..

  చాలా మంది ప్రేమలో విఫలమైనా కూడా, ఒంటరిగా జీవించలేక మరో ప్రేమ కథకు బాటలు వేసుకుంటారు. ఇలాంటి సమయంలోనే తమ ప్రేమలో ఎలాంటి వ్యక్తిని ఎంచుకన్నామన్న దాని గురించి ఆలోచించరు. వారి ప్రేమను ఎప్పటికీ తగ్గించరు. కేవలం రొమాన్స్ కోసం ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు.


 • డేటింగుకు కూడా..

  మీరు అలాంటి వారి గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే మీతో తిరగడం ప్రారంభిస్తారు. అయితే వారు మిమ్మల్ని మాత్రం ప్రేమించరు. కానీ మీకు ఏమి కావాలో ఇస్తారు ఒక్క ప్రేమను తప్ప.


 • ప్రేమను వ్యక్తపరచడం..

  మీరు ఇంతకుముందు బంధంలో ఎందుకు విడిపోయారో కూడా మీకు సరిగ్గా తెలియదు. దాని నుండి మీరు ఏమి నేర్చుకున్నారో మీకు అర్థం కాలేదు. అందుకే మీరు సందిగ్ధంలో ఉంటారు. దాని వల్లే మీరు రీబౌండ్ రిలేషన్ షిప్ కోసం తహతహలాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొత్త వ్యక్తులను కోసం అన్వేషిస్తారు. వారితో కొంచెం సన్నిహిత సంబంధం ఏర్పడే సరికి వారిపై మీ ప్రేమను వ్యక్తపరచడం ప్రారంభిస్తారు.


 • తక్కువ సమయంలోనే..

  కొత్త వ్యక్తులు పరిచయమై పట్టుమని పదిరోజులు కూడా కాకముందే వారితో ప్రేమను కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇదంతా పాత ప్రేమ వైఫల్యాన్ని మరచిపోవడానికేనని చాలా మంది చెబుతారు.


 • వాస్తవానికి లోతైన బాధ..

  మీరు మీ మాజీ ప్రియుడు/ప్రియురాలితో పూర్తిగా విడిపోయారని, ఇప్పుడు మాత్రం మీరు చాలా సంతోషంగా ఉన్నారని, మీ గురించి మీ భాగస్వామికి చెబుతూ ఉంటే, మీరు నిజంగా హ్యాపీగా ఉన్నట్టు కాదు. మీరు ఇంకా లోతైన బాధలో ఉన్నారని అర్థం.


 • సాన్నిహిత్యంపైనే ఆధారం..

  మీది రీబౌండ్ రిలేషన్ షిప్ అయితే, మీరు ప్రస్తుత భాగస్వామితో మీ మాజీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. అతనిని లేదా ఆమెను మీ మాజీతో పోల్చేందుకు ఉన్న ఎలాంటి అవకాశాన్ని వదులుకోలేరు. అయితే మనలో చాలా మంది కొత్త సంబంధం గురించి సంతోషిస్తారు. కానీ అతిగా ఉత్సాహం అనేది మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఇక మీ కొత్త సంబంధం చాలా వరకు శారీరక సాన్నహిత్యంపై ఆధారపడి ఉంటుంది. భాగస్వాముల మధ్య మానసిక సంబంధం ఉండదు.
మనం సినిమాల్లో చూస్తున్నట్లుగానే మన జీవితంలో కూడా మన మనసుకు దగ్గరగా ఉండేవారితో కొన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మన జీవితమంతా చీకటిమయంగా మారిపోయిందని అనిపిస్తుంది. అలాంటి క్షణాలను ఎదుర్కోవడానికి చాలా ధైర్యం కావాలి. నిజం చెప్పాలంటే అలాంటి పరిస్థితుల నుండి కోలుకోవడం అంత సులభం కాదు.

ఎందుకంటే నిజాయితీగా ప్రేమించిన వాళ్లలో చాలా మంది పిచ్చివాళ్లయినా సంగతి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఉన్నాయి. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల నుండి బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయని మేము గ్రహించాము.

దీని కోసం కొన్నిసార్లు మీరు కౌన్సెలింగ్ సెషన్ తీసుకోవచ్చు. తరచుగా ఇలాంటి వాటిని తీసుకుంటే మీరు కొంత వరకైనా కోలుకునే అవకాశం ఉంటుంది. మరొకరితో కొత్త జీవితం కూడా ప్రారంభించి పాత సంబంధాలను మరచిపోవచ్చు. అందుకు కొన్ని సంకేతాలున్నాయి. ఆ సంకేతాలుంటే మీరు రిలేషన్ షిప్ లో పుంజుకున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...